పేదల ఇళ్ల స్థలాలపై టీడీపీ కుట్రలు: రోజా

అమరావతి: పేదల ఇళ్ల స్థలాలపై టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇవాళ జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ.. టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని అన్నారు.

క్రియేటీవ్ ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఎవరో రాసిన స్క్రిప్ట్ ని ట్విట్టర్ లో పెట్టడమే లోకేష్ కు తెలుసునని అన్నారు. సర్పంచ్ గా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్ అంటూ ఎద్దేవా చేశారు.

latest telugu newsTelugu breaking newstelugu news