అక్కడి పరిచయంతో లొంగిపోయా…!

బెంగళూరు: నీటి పారుదల శాఖ మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి కర్ణాటక విధాన సౌధలో పరిచయం అయ్యాడని, అక్కడి నుంచే తమ స్నేహం మొదలైందని రాసలీల కేసులో బాధిత యువతి పోలీసులకు వెల్లడించింది.

విధాన సభలో మంత్రిగా ఉన్న సమయంలో తను పరిచయం అయిన తరువాత ఆయన నెంబర్ ను మల్లేశ్వరం పిజి అని తన ఫోన్ కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకున్నట్లు తెలిపింది. తనకు సహకరిస్తే అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇవ్వడంతో లొంగిపోయానని, తనను శారీరకంగా అనుభవించాడని బాధిత యువతి పూసగుచ్చి చెప్పింది. బాధిత యువతిని బెంగళూరులోని బౌరింగ్ హాస్పిటల్ లో బుధవారం నాడు వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. ఇన్నాళ్లు అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆమె బయటకు వచ్చింది. భారీ బందోబస్తు మధ్య ఆమెను బౌరింగ్ హాస్పిటల్ కు తీసుకువచ్చి, తరువాత సిట్ ఆఫీసుకు తరలించారు.

శారీరకంగా వాడుకున్న తరువాత ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడగ్గా, తమ ప్రాంతంలో బలమైన నాయకుడు కావడంతో ఏమి చేయలేక మౌనం దాల్చినట్లు యువతి పోలీసులకు తెలిపింది. భవిష్యత్తులో ఎప్పుడైనా సాక్ష్యాలుగా పనికొస్తాయనే ఉద్దేశంతో అప్పుడప్పుడు వీడియోలు తీసి భద్రపర్చుకున్నట్లు చెప్పింది. రమేష్ తో శారీరకంగా కలిసినట్లు తల్లిదండ్రులకు ఇప్పటి వరకు చెప్పలేదని, తన క్లాస్ మెట్ శ్రవణ్ తో పాటు మరో వ్యక్తి నరేష్ కు వీడియో సిడి ఇచ్చినట్లు చెప్పింది. మరో సిడిని తన రూమ్ లో భద్రపర్చినట్లు బాధిత యువతి పోలీసులకు వివరించింది. కర్ణాటకలో ఈ రాసలీల కేసు సంచలనంగా మరింది.

bengalore sit officejarkiholi caught sex scamkarnataka bjpkarnataka sex scamminister ramesh jarkiholisex for jobsex tape scandal