హాస్టల్ రూమ్ లో పీహెచ్ డీ విద్యార్థిని ఆత్మహత్య

తిరుపతి: హాస్టల్ రూమ్ లో ఓ పీహెచ్ డీ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన
తిరుపతి రూరల్ పరిధిలోని ఎస్వీయూ స్టాఫ్ క్వార్టర్స్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. శ్యామల అనే విద్యార్థిని తిరుపతి ఎస్వీయూ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ ఫైనలియర్ చదువుతోంది.

కాగా ఇవాళ హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన సహచర విద్యార్థులు, సిబ్బంది వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. శ్యామల నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన విద్యార్థిగా సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

crime newslatest telugu newssuicide phD StudentTelugu breaking newstelugu news