ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం…

విజయవాడ: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక గృహిణి, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విజయవాడ గ్రామీణం నున్న గ్రాన కోటగట్టు సెంటర్ లో ఘటన చోటు చేసుకున్నది.

సురేంద్ర గత కొంతకాలంగా నున్న కోటగట్టు సెంటర్ లో చిల్లరకొట్టు వ్యాపారం చేస్తూ రాత్రి సమయంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న రాత్రి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి భార్య, ఇద్దరు పిల్లలు పురుగులు మందు సేవించి నోటి నిండా నురగతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది చూసిన సురేంద్ర భయాందోళనకు గురై వెంటనే వారిని చికిత్స నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలించాడు. గుంటురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భావన(3) మృతి చెందింది. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు నున్న గ్రామీణ పొలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

suicide attemptSuicide attempt with financial difficultiesTelugu breaking newsTelugu latest newstelugu news