విద్యార్థులను నగ్నంగా నాట్యమాడించారు…

ముంబయి: కేసు విచారణ పేరుతో బాలికల హాస్టల్ లోకి ప్రవేశించిన కొందరు పోలీసులు వారు వేసుకున్న దుస్తులు విప్పించి నగ్నంగా నృత్యం చేయించారు. ఈ ఘటన జల్గావ్ లో చోటు చేసుకున్నది.

ఈ దారుణ ఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో తీవ్రంగా స్పందించి, వెంటనే విచారణకు ఆదేశించింది. నలుగురు కమిటీ సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీ వేసింది. ఈ విషయాన్ని అసెంబ్లీలో హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. జల్గావ్ లో విచారణ పేరుతో బాలికల హాస్టల్ లోకి కొందరు మగవాళ్లు, పోలీసులు ప్రవేశించారు. విచారించాలంటూ వారి దుస్తులను విప్పించారు. ఆ తరువాత నగ్నంగా నాట్యామాడించి వెళ్లిపోయారు. ఈ ఘటనతో బాలికలు లోలోపల కుమిలిపోయారు. ఈ ఘటను పూర్తిగా చిత్రీకరించిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.

crime newslatest telugu newsstudents danced nakedTelugu breaking newstelugu news