నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి

మూలుగు: ఓ నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన ఘటన జిల్లాలోని దేవగిరిపట్నం శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకెలితే.. కర్ణాటకకు చెందిన వలస కూలీలు అయిన.. అయిలప్ప, సునితలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు చిరంజీవి(4), ఇంకో పాప ఉంది. బాలుని తల్లి దేవగిరి పట్నం వైపు పైప్ లైన్ నిర్మాణ పనులకు వెళ్లింది.

అదే సమయంలో తల్లి కోసం వెళ్లిన ఆ బాలునిపై ఒక్కసారిగా వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

four-year-old childlatest telugu newsStreet dog attackTelugu breaking newstelugu news