ఏపీలో వాలంటీర్ల సేవలకు బ్రేక్: ఎస్ఈసీ

తిరుపతి: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు ఉండవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు వాలంటీర్ల కదలికలపై దృష్టి పెడతామన్నారు.
గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్రలపై పలు అనుమానాలు తలెత్తాయని అన్నారు. వాలంటీర్లే దగ్గరుండి అధికార పక్షానికి సహకరించారని.. విపక్ష పార్టీలన్నీ ఫిర్యాదులు చేశాయన్నారు. ఈ నెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని చెప్పారు. వరుస క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం తిరుపతిలో ఆయన పర్యటించారు. తొలి పర్యటనలో ఆయన సంచలన నిర్ణయాలను ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి ఐదుకు మించి సభ్యులు ఉండకూడదని నిబంధన పెట్టారు.

కానీ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారాలు చూస్తే ఎక్కడా అధికారులు అలాంటి ఆంక్షలు అమలు చేయడం లేదు. ప్రతి కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారంలో 50కి పైగా అనుచరులు పాల్గొంటున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం చేస్తే వారిపై కేసులు పెడతమంటున్నారు. కోవిడ్ నిబంధనలు తప్పక అందరూ పాటించాల్సిందేని స్పష్టం చేశారు. ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. చెక్ పోస్టుల దగ్గర పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయి అన్నారు. పోలీస్టేషన్ కు వందకిలోమీటర్ల దూరంలో ప్రచారం చేయకూడదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని ఎవరైనా ఆధారాలను చూపిస్తే పునః పరిశీలిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయని రమేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

latest telugu newsState Election Commissioner Nimmagadda Ramesh KumarTelugu breaking newstelugu news