కరోనా కాలంలోనూ తగ్గని శ్రీవారి ఆదాయం

తిరుమల: కరోనా కష్టకాలంలోనూ తిరుమల తిరుపతి దేవస్తానంలో శ్రీవారి హుండీ ఆదాయం ఏమాత్రం తగ్గలేదని టీటీడీ అధికారులు తెలిపారు. గతంలోనూ శ్రీవారికి హుండీ ద్వారా తలసరి ఆదాయం రూ.428 వచ్చినట్టు తెలిపారు.

కాగా ప్రస్తుత కరోనా కాలంలోనూ శ్రీవారి హుండీ తలసరి ఆదాయం రూ.620 కి పెరిగినట్టు సమాచారం. అయితే కరోనా కాలంలోనూ శ్రీవారిని దర్శించుకునేందుకు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే.

latest telugu newsSrivari Income in Tirupati DevasthanTelugu breaking newstelugu newstirumala tirupatiTirupati Devasthan