వైసీపీ వార్ ఎవ‌రు విన్న‌ర్‌!

వైసీపీలో కోల్డ్‌వార్‌. నిజ‌మా! అని సందేహం వ‌ద్దు. ఎందుకంటే… ఎప్పుడూ పెద్ద‌వాళ్ల మ‌ధ్య యుద్ధాలు ఇలాగే ఉంటాయి. ప‌దేళ్ల పోరు త‌రువాత సాధించుకున్న అధికారం. మున్ముందు కాలం ఎలా ఉంటుంద‌నేది చెప్ప‌టం కూడా క‌ష్ట‌మే. అంతా బాగానే ఉన్న‌ట్టుగా క‌నిపిస్తుంది. కానీ వెనుక నుంచి గోతులు తీసే మంద ఉంటుంది. 2024లో గెలుస్తామ‌నే ధీమా ఉన్నా ఏదోమూల‌న భ‌యం ఉంటుంది. అప్ప‌టికి సీటు ద‌క్కినా ద‌క్కొచ్చు. లేదా.. సారీ అంటూ నామినేటెడ్ పోస్టు చూద్దామంటూ అధినేత దాటేయ‌వ‌చ్చు. అందుకే ఎవ‌రికి వారు ఇప్పుడు కాస్తోకూస్తో వెనుకేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 108 , 104 వాహ‌నాల‌తో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి లాభ‌ప‌డ్డాడంటూ టీడీపీ ఆరోపిస్తుంది.

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరావు ఏకులా వ‌చ్చి మేక‌య్యాడు. సుతిమెత్త‌గా గుచ్చుతున్నాడు. ఇక‌పోతే మంత్రి ప‌ద‌విపై ఆశ‌పెట్టుకున్న సీనియ‌ర్ల‌లో ఎంతమందికి రెండోద‌ఫా మంత్రివ‌ర్గ మార్పుల్లో అవ‌కాశం ఉంటుంద‌నేది చెప్ప‌టం క‌ష్ట‌మే. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు వ‌ర్సెస్ క‌మ్మ నాయ‌క‌త్వం మ‌ధ్య ఆల్రెడీ వార్ షురూ అయింది. ఏపీలో జిల్లాల బాధ్య‌త‌ల‌న్నీ విజ‌యసాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌ కృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి వారికి క‌ట్టబెట్ట‌డాన్ని అంద‌రూ పైకి ఆమోదిస్తున్న‌ట్లు అంగీక‌రించినా లోలోప‌ల మున్ముందు త‌మ నాయ‌క‌త్వానికి స‌వాల్‌గా భావిస్తున్న సీనియ‌ర్ నేత‌లు లేక‌పోలేదు. పీవీపీ విజ‌య‌వాడ ఎంపీగా రెండోసారి విఫ‌ల‌మైన వైసీపీ నేత‌. ఇప్పుడు ఈయ‌న‌తో పార్టీకు కొత్త చిక్కులు త‌ప్ప‌ట్లేదు. హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లో ఇంటి గొడ‌వ‌తో అరెస్టును త‌ప్పించుకునేందుకు ఏకంగా బెజ‌వాడ‌లో మ‌కాం పెట్టార‌ట‌. దీంతో పోలీసులు అక్క‌డ‌కు చేరి.. వెతుకులాడే ప‌నిలో ప‌డ్డార‌ట‌. విశాఖ‌ప‌ట్ట‌ణంలో పార్టీలో చికాకులు… ప్ర‌కాశం జిల్లాలో క‌ర‌ణం బ‌ల‌రాం రాక‌తో అప్ప‌టి వ‌ర‌కూ వైసీపీలో ఉన్న కేడ‌ర్‌లో కాస్త కినుకు వ‌హించార‌ట‌. సీమ‌లో
ప్ర‌స్తుతం అంద‌రూ సైలెంట్ అయినా.. క‌ర్నూలు, అనంత‌పురంలో ఆధిప‌త్యం కోసం వైసీపీ నేత‌లు వ‌ర్గాలు మారార‌ట‌. ఇలా.. బ‌య‌ట‌కు అంతాబాగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తూనే.. లోలోప‌ల అంత‌ర్గ‌త పోరు.. అధినేత‌ను కాస్త ఇబ్బందికి గురిచేస్తుంద‌నే గుస‌గుస‌లు లేక‌పోలేదు.

Ap political newslatest telugu newsspecial story on ycpTelugu breaking newstelugu news