సానియా కుమారుడి వీసా తిరస్కారం

న్యూఢిల్లీ: టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కుమారుడితో పాటు సహాయకురాలి వీసాను ఇంగ్లండ్ ప్రభుత్వం తిరస్కరించింది. భారత్ లో కరోనా విజృంభణ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చేవారి పట్ల ఇంగ్లండ్ ప్రభుత్వం జాగ్రత్తలు వస్తున్నది.

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో పాల్లొనేందుకు వస్తున్న సానియాకు మాత్రమే వీసా మంజూరు చేసింది. తనతో పాటు తన కుమారుడు, సహాయకురాలి వీసా ఇవ్వాలని సానియ చేసిన వినతిని ఆ దేశం తిరస్కరించింది. తన రెండేళ్ల కుమారుడిని భారత్ లో వదిలి ఇంగ్లండ్ లో ఉండలేనని, రెండేళ్ల బాబుకు కూడా వీసా మంజూరు చేయించాలని సానియా కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజ్ కు వినతి చేసింది. సానియా వినతిపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఇంగ్లండ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. లండన్ లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయంలో సహకరిస్తుందని కిరణ్ రిజిజు సానియాకు తెలిపారు.

latest telugu newsTelugu breaking newstelugu newstennis player Sania Mirza