సూపర్ మార్కెట్ లో కాల్పుల మోత…

వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల మోత ఆగడం లేదు. అట్లాంటాలో ఆసియా మసాజ్ పార్లరే లక్ష్యంగా జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే కొలరాడోలోని బౌల్డర్ నగరంలోని సూపర్ మార్కెట్ లో పునరావృతం అయ్యాయి.

బౌల్డర్ నగరంలో సోమవారం మధ్యాహ్నం కింగ్ సూపర్ మార్కెట్ లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. వినియోగదారులపై కాల్పులకు దిగడంతో ఒక పోలీసు అధికారితో సహా పది మంది పౌరులు చనిపోయారు. కాల్పులకు దిగిన వ్యక్తిన పోలీసులు అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడనేది తెలియాల్సి ఉందని పోలీసు చీఫ్ మారిస్ హెరొల్డ్ తెలిపారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసినట్లు కొలరాడొ గవర్నర్ జారెడ్ పోలీసు తీవ్ర విచారం వెలిబుచ్చారు. బౌల్డర్ మేయర్ సామ్ వీవర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

latest telugu newsShooting in the supermarketTelugu breaking newstelugu news