ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది: ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తోందనన్నారు. ఉద్యోగులకు 7.5% ఫిట్ మెంట్ ఇవ్వడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే 7.5% ఫిట్మెంట్ నిర్ణయం జరిగిందన్నారు. ఫిట్ మెంట్ 43%కు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యోగస్తులు చేసే అన్ని ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ పీఆర్సీ రిపోర్ట్ వెల్లడించిందన్నారు. ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంచడం సిగ్గు చేటన్నారు. ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంపై తిరగబడి ఉద్యమించాలని సూచించారు.

latest telugu newsTelugu breaking newstelugu newsTPCC Chief Uttam Kumar Reddy