ఆగస్టు 14న శశికళ విడుదల

బెంగళూరు: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ ఆగస్టు 14ను విడుదల కానున్నారు.
బెంగళూరులోని పరప్పన ఆగ్రహార సెంట్రల్ జైలులో ఆమె జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. 2017, ఫిబ్రవరి 18న శశికళ నటరాజన్ ను అరెస్టు చేసి జైలుకు పంపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జైలు శిక్ష అనుభవిస్తుండగానే భర్త నటరాజన్ మృతి చెందాడు. జైలు నుంచే చక్రం తిప్పాలని ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేకపోయారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడంతో పాటు ప్రభుత్వాన్ని అస్థిరపర్చే ప్రయత్నాలు చేయడంతో 2017 ఆగస్టు 21న శశికళతో పాటు టీటీవీ దినకరన్ ను ఏఐఏడిఎంకే అధిష్టానం బహిష్కరించింది. దీంతో శశికళ అమ్మా మక్కల్ మున్నేట్ర కజగమ్ పార్టీని స్థాపించింది.

latest telugu newssashikala Released August 14thsasikala natarajanTelugu breaking newstelugu news