టిప్పర్ కింద 15 నిమిషాలు నరకయాతన

హైదరాబాద్: ఎల్.బి.నగర్ పరిధిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరుక్కుపోయిన ఒక వ్యక్తి పావుగంట నరకయాతన అనుభవించాడు. ఈ లోపు స్థానికులు, పోలీసులు కలిసి అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి పంపించారు.

సాగర్ రింగ్ రోడ్డు నుంచి టీకీఆర్ కమాన్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని టిప్పర్ డ్రైవర్ వేగంగా నడిపిస్తూ బలంగా ఢొకట్టాడు. ఈ ఘటనతో బైక్ పై ఉన్న వ్యక్తి తన వాహనంతో సహా టిప్పర్ కిందకు వెళ్లి ఇరుక్కున్నాడు. బయటకు రాలేని పరిస్థితి. అతని అరుపులు, కేకలు విన్నవారు అక్కడకు చేరుకున్నారు. బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. జేసీబీ రావడం ఆలస్యం కావడంతో ఈలోపు పోలీసులు రావడంతో అందరూ కలిసి అతన్ని బయటకు తీశారు. తీవ్ర గాయాల పాలైన అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

latest telugu newsRoad accident in LB Nagar areaTelugu breaking newstelugu news