జూరాలకు పెరుగుతున్న వరద

మహబూబ్ నగర్ : గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో, ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 4,145 క్యూసెక్కులు ఉండగా.. దిగువకు 2,583 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.512 టీఎంసీల నీరు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.950 మీటర్లకు చేరింది.

latest telugu newsRising flood to JuralaTelugu breaking newstelugu news