రెమిడెసివిర్… తెలంగాణ టు ఏపి

కృష్ణా: రెమిడెసివిర్ ఇంజక్షన్ల కోసం తెలంగాణలో కరోనా రోగులు అల్లాడుతుంటే అక్రమ మర్గాన ఏపికి తరలి వెళ్తున్నాయి. ప్రభుత్వం నిఘా వైఫల్యం కారణంగా పక్క రాష్ట్రాలకు పక్కగా వెళ్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర నుండి గుంటూరుకు అక్రమంగా బస్సులో తరలిస్తున్న 100 రెమిడిసివిర్ ఇంజక్ష్లను గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. తరలిస్తున్న వ్యాపారి గుప్తవరపు అజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమతి లేకుండా ఎలా తీసుకువెళ్తున్నారని పోలీసులు మండిపడ్డారు. ఒక్కో ఇంజక్షన్ ను ఎంతకు అమ్ముతున్నారు, ఎవరికి అమ్ముతున్నారనే అంశంపై అజయ్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

latest telugu newsRemdesivir injectionTelugu breaking newstelugu news