తెలంగాణ లాక్ డౌన్ తో రిజిస్ట్రేషన్లు బంద్‌

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా పది రోజులపాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికి మళ్లీ అవకాశం కల్పిస్తామని తెలిపింది.

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాతే స్లాట్ కేటాయింపుపై మార్గదర్శకాలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ప్రజలెవరూ తహశిల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు రావొద్దని కోరారు.

latest telugu newsRegistrations closedtelangana lockdownTelugu breaking newstelugu news