పోలీసుల అదుపులో రామతీర్థం దోషులు

విజయనగరం: రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ఖండిత ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేసిన ఇద్దరిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి ఎలక్ట్రికల్ రంపం స్వాధీనం చేసుకున్నారు. రెండు దేవాలయాల్లో విగ్రహాలను ఎలక్ట్రికల్ రంపంతో దుండగులు కోశారు. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన ఈ ఘటనపై ప్రభుత్వం సీఐడి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

latest telugu newsRamatirthaRamatirtha convictedTelugu breaking newstelugu news