క్లాసులతో పాటు బూతు పురాణం: రాజస్థాన్ డీజీపీ

జైపూర్: ఆన్ లైన్ క్లాసులతో బూతు వీడియోలు చూసే విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నదని రాజస్థాన్ డీజీపీ ఎంఎల్.లాథేర్ సంచలన ప్రకటన చేశారు. తల్లిదండ్రులు విద్యార్థులను ఒక కంట కనిపెట్టాలని ఆయన హితవు పలికారు.
గత నెలలో ఝన్ జనులో ఐదు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన యువకుడు నిత్యం బూతు వీడియోలు చూసేవాడని ఆయన తెలిపారు.

ఈ విషయాలు తమ విచారణలో వెలుగు చూశాయని ఆయన వివరించారు. మహిళలపై నేరాలు పెరుగుతున్నది వాస్తవమేనని, చట్టాన్ని అమలు చేయడానికి పోలీసులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. కరోనా మహమ్మారి కారణంగా విద్యాలయాలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ స్థోమతకు మించి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు పిల్లలకు కొనిచ్చారని ఆయన చెప్పారు. చాలా మంది విద్యార్థులు క్లాసులు పూర్తయిన తరువాత, విరామ సమయంలో బూతు వీడియోలు చూస్తున్నారన్నారు. కావున విద్యార్థులను ఒక కంట కనిపెట్టాలని డీజీపీ తల్లిదండ్రులను కోరారు.

latest telugu newsRajasthan DGP ML LatherTelugu breaking newstelugu news