చెడ్డ తల్లి ఉండదు: పంజాబ్ హైకోర్టు

చండీగఢ్: సమాజంలో చెడ్డ మహిళ ఉంటుంది కాని చెడ్డ తల్లి ఉండదనేది ఎప్పటి నుంచో వింటున్నాం. పేగు తెంచుకున్న బిడ్డల కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. బిడ్డల బాగు కోసం అహర్నిషలు పాటుపడుతుంది.
అలాంటి తల్లికి పంజాబ్-హర్యానా హైకోర్టు కూడా మద్దతు పలికింది. తల్లి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నంత మాత్రాన చెడ్డ తల్లిగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది.

వివాహేతర సంబంధం ఉందంటూ తన నుంచి నాలుగున్నరేళ్ల బిడ్డను భర్త బలవంతంగా తీసుకువెళ్లాడంటూ ఒక మహిళ హేబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసును జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ బెంచి విచారిచింది. పితృ స్వామ్య వ్యవస్థలో స్త్రీ నైతిక స్వభావంపై నిందలు వేయడం సహజమని, ఆధారాలు లేకుండా నిందలు వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఆమె మంచి తల్లి కాదనడానికి ఎవరికి హక్కు లేదన్నారు. సంతానాన్ని ఆమెకు దూరం చేయడం జరగకూడదని జస్టిస్ అనుపిందర్ అన్నారు. భర్త, భార్య తరఫు వాదనలు విన్న కోర్టు తల్లికే మద్దతు పలికింది. నాలుగున్నరేళ్ల కుమార్తెను ఆమెకు అప్పగించాలని హైకోర్టు తుది తీర్పునిచ్చింది.

latest telugu newsPunjab High CourtTelugu breaking newstelugu news