లాక్ డౌన్ అబద్దం… కొట్టిపారేసిన కేంద్రం!

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారని, మే 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టతనిచ్చింది.

మే నెల 3వ తేదీ నుంచి మే 20 వరకు పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఇది చూసిన పలువురు నిజమేనని నమ్ముతున్నారు. ఒక టివి ఛానల్ లాక్ డౌన్ విధిస్తున్నదంటూ ప్రసారం చేసిన వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాము అలాంటి వార్తను ప్రసారం చేయలేదని టివి చానల్ స్పందించేలోపు అది కోట్లాది మందికి చేరిపోయింది. లాక్ డౌన్ విధించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టతనిచ్చిన విషయం కూడా తెలిసిందే. అయినా ప్రజలు ప్రధాని మాటను విశ్వసించడం లేదు. ఈ పోస్టుల పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసినట్లు ప్రకటించింది. లాక్ డౌన్ విధించడం లేదని, ఇవి వదంతులు అంటూ కొట్టిపారేసింది.

latest telugu newsPress Information BureauTelugu breaking newstelugu news