గ్రేటర్ హైదరాబాద్ లో అకాల వర్షం

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాలలో కురిసిన అకాల వర్షం భీభత్సాన్ని సృష్టించింది. కూకట్ పల్లి, నిజాం పేట, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, ఫిలింనగర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, పంజగుట్ట, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
అల్పపీడనం ప్రభావంతో నగరంతో సహా తెలంగాణలో వర్షాలు పడ్డాయి.

అకస్మాత్తుగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయం కాగా, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాలలో అంధకారం నెలకొంది. ఎక్కడికక్కడ నీరు నిల్చిపోవడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి.

latest telugu newsrain in Greater HyderabadTelugu breaking newstelugu news