తెలంగాణ ఎంసెట్ పరీక్షలు వాయిదా

హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్‌ పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయిం తీసుకున్నది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ప్రకటించింది.

ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూలై 5, 6 తేదీల్లో ఎంసెట్‌ మెడికల్‌.. 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష జరగాల్సి ఉండగా వాయిదా పడింది. అయితే మే-2 నుంచి జరగాల్సిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వాయిదాపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెకండియర్‌ పరీక్షలను జూలై 15 తర్వాత నిర్వహించాలని ఇంటర్ బోర్డు యోచిస్తున్నదని పేర్కొన్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష తేదీలు ఖరారైన తర్వాతే ఎంసెట్‌ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

covid second waveeamcet sheduleinter second year examstelangana eamcettelangana education newsTelugu latest news