ఇండియాకు ఫైజర్ 5 కోట్లు వ్యాక్సిన్ డోసులు

న్యూఢిల్లీ: సెకండ్ వేవ్ వైరస్ తో అతలాకుతలం అవుతున్న ఇండియాకు యుఎస్ ఫార్మా సంస్థ ఫైజర్ వ్యాక్సిన్ కంపెనీ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం కల్లా 5 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వనున్నట్లు తెలిపింది.

దేశంలో వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫైజర్ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు చేయక తప్పని స్థితి ఉంది. యుఎస్ లో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా సంస్థల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కాని ఈ రెండు వ్యాక్సిన్లను ఇతర దేశాలకు విక్రయించేందుకు అక్కడి ప్రభుత్ ఏమాత్రం సుముఖంగా లేదు. యుఎస్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయిన తరువాతే ఇతర దేశాలకు విక్రయించాలని షరతు విధించింది. దీంతో మరో నాలుగు నెలలు ఆగితే కాని ఇండియాకు అనుకున్న విధంగా 5 కోట్ల వ్యాక్సిన్లు వచ్చే పరిస్థితులు లేవు.

latest telugu newsPfizer 5 crore vaccineTelugu breaking newstelugu news