లవ్ జిహాద్ పై సుప్రీంలో పిటీషన్లు

న్యూఢిల్లీ: హిందు-ముస్లింల వివాహాలను నిషేధిస్తూ ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెచ్చి ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి.

ఆర్టికల్ 21 ద్వారా రాజ్యాంగం కల్పించి ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్టికల్ 25 కల్పించిన మతాచారానికి వ్యతిరేకంగా ఈ చట్టాలు ఉన్నాయని పిటీషన్ లో తెలిపారు. మతాంతర వివాహం చేసుకునే వారిలో భయాలు కల్పించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయన్నారు. ఢిల్లీకి చెందిన న్యాయవాది యూపీ ఆర్డినెన్స్ తో పాటు ఉత్తరాఖండ్ మత స్వేచ్ఛ చట్టం 2018ను కూడా సవాల్ చేశారు.

latest telugu newsTelugu breaking newstelugu news