వారికి 60 ఏళ్ల దాకా జీతమిస్తా: టాటా స్టీల్

ముంబయి: కరోనా వైరస్ బారిన పడి ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చే విధంగా టాటా స్టీల్ ప్రకటన చేసింది. సెకండ్ వేవ్ లో చనిపోతే వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపింది.

టాటా స్టీల్ ఉద్యోగులు వారి కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటుంది. వారు మెరుగైన జీవనం సాగించేందుకు సహాయం చేస్తుంది. ఒకవేళ ఉద్యోగి కరోనా పాజిటివ్ సోకి చికిత్స పొందుతూ చనిపోతే ఆయన కుటుంబానికి ప్రతినెలా జీతం పంపిస్తాం. ఆయన రిటైర్మెంట్ అయ్యేవరకు టాటా స్టీల్ ప్రతి నెలా వేతనం పంపిస్తుందని వెల్లడించింది. వైద్యంతో పాటు గృహపరమైన లబ్ధి పొందేలా చూసుకుంటామని తెలిపింది. ఒక వేళ విధుల్లో చనిపోతే పూర్తి స్థాయి జీతంతో పాటు సదరు ఉద్యోగి పిల్లలకు ఇండియాలో గ్రాడ్యుయేషన్ వరకు మేమే ఖర్చులు భరిస్తాం. తమ ఉద్యోగులకు ఎప్పుడూ అండగా ఉంటామని టాటా స్టీల్ ప్రకటించడం సంచలన వార్తగా మారింది.

Tata SteelTata Steel employeesTelugu breaking newsTelugu latest newstelugu news