డయాలసిస్ కోసం పేషెంట్ల ఆందోళన

హైదరాబాద్: తమకు డయాలసిస్ చేయడం లేదంటూ కిడ్నీ సంబందిత పేషెంట్లు ఆందోళనకు దిగిన ఘటన నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. నిమ్స్ నెప్రాలజీలో డయాలసిస్ పేషెంట్లకు డయాలసిస్ చేయడంలేదంటూ పేషెంట్లు అందోళనకు దిగారు. కనీసం పేర్లు కూడా నమోదు చేసుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారానికి నాలుగు సార్లు చేయాల్సిన డయాలసిస్ ను ప్రస్తుతం మూడు సార్లే చేస్తున్నారని వాపోయారు. 4 గంటల పాటూ నిర్వహించాల్సిన డయాలసిస్ ను మూడు గంటలు మాత్రమే చేస్తున్నారన్నారు. డయాలసిస్ పై నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు.

latest telugu newsPatients concern for dialysisTelugu breaking newstelugu news