300 మంది డ్యాన్సర్లతో పాన్ ఇండియా మువీ పాట

ఈ మధ్య అన్ని భాషల్లో పాన్ ఇండియా చిత్రాలు మొదలయ్యాయి. శాండల్ వుడ్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం విక్రాంత్ రోణ లో బాలీవుడ్ హీరోయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ ఆర్టిస్టుగా కన్పించనున్నారు.
చిత్ర బృందం ఇటీవలే వీరిద్దరి పై ఒక పాటతో పాటు కీలక సన్నివేశాలను షూట్ చేసింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేతృత్వంలో భారీ సెట్ ఏర్పాటు చేసి సుమారు మూడు వందల మంది డ్యాన్సర్లతో పాటను షూట్ చేశారు.

ప్రపంచానికి ప్రత్యేకమైన భారతీయ కథను పరిచయం చేయబోతున్నారని, భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని జాక్వెల్ అన్నారు. జక్వెలిన్ తో చిత్రానికి పేరొచ్చిందని, మీ డ్యాన్స్ తో ఎనర్జీ రెట్టింపు చేశారని కిచ్చా సుదీప్ అభినందించారు. జాక్వెలిన్ స్వతహాగా ప్రొఫెషనల్ యాక్టర్ అని, తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారన్నారు. చిత్రానికి నిర్మాతగా జాక్ మంజునాథ్ వ్యవహరిస్తుండగా నీతా అశోక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అనూప్ భండారి దర్శకత్వం చేస్తున్నారు.

Telugu breaking newsTelugu latest newstelugu news