దాయాది ప్రధాని ఫోన్ ట్యాప్

ఇస్లామాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తమ మంత్రులు, ముఖ్య నాయకులు, జర్నలిస్టులతో పాటు దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తుందట.

ఈ విషయాన్ని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ ఛౌదరి ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదని, ఇంతకు ముందు పనిచేసిన ఏ ప్రధాని కూడా ఇంత దుస్సాహసానికి పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు. ఇండియా గవర్నమెంట్ చేసిన హ్యాకింగ్ వివరాల కోసం మేము ఎదురు చూస్తున్నామని, ఆ వివరాలు చేతికి అందగానే వెల్లడిస్తామన్నారు. అంతర్జాతీయ వేదికలపై ఇండియా కుట్రలను బహిర్గతం చేస్తామని ఫవాద్ ఛౌదరి తెలిపారు.

 

latest telugu newsTelugu breaking newstelugu news