యుద్ద విమానాల్లో ఆక్సిజన్…

హైదరాబాద్: తెలంగాణకు ఆక్సిజన్ తెప్పించేందుకు ఖాళీ ట్యాంకర్లను యుద్ద విమానాల్లో ఒడిశాకు పంపించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఎయిర్ ఫోర్స్ విమానాల్లో వీటిని ఇవాళ ఉదయం పంపించారు.

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒడిశాలో ట్యాంకులలో ఆక్సిజన్ నింపుకున్న తరువాత తిరిగి విమానాశ్రయం వస్తాయి. యుద్ధ విమానాల్లో వాటిని ఎక్కించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటాయి. ఒక రోజు వ్యవధిలోనే వెళ్లిరావడం వల్ల మూడు రోజులు ఆదా అవుతుంది. సాధారణంగా రోడ్డు మార్గం ద్వారా వెళ్తే మూడు రోజుల సమయం తీసుకుంటుందని, ఈ విధానంలో అయితే ఒకే రోజులో వస్తాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీని వల్ల కరోనా రోగులకు త్వరితగతిన ఆక్సిజన్ అందడంతో ప్రాణాలు దక్కుతాయన్నారు.

latest telugu newsmOxygen in a fighter planeTelugu breaking newstelugu news