చిల్లర సంచి… ఊసురుమంటున్న ఆర్టీసీ ఉద్యోగులు!

ముంబయి: ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందంటే ఇదేనేమో. రాసుల కొద్ది చేరిన చిల్లర నాణేలు వదిలించుకోవడానికి బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అం ట్రాన్స్ పోర్టు (బెస్ట్) యాజమాన్యం నానా తంటాలు పడుతోంది.

గత కొద్ది రోజులుగా టికెట్ల విక్రయం ద్వారా బస్ డిపోలలో రూ.లక్షల్లో చిల్లర నాణేలు జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు రూ.12 కోట్ల విలువ చేసే నాణేలు పోగవ్వడంతో వదిలించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ నాణేలు తీసుకునేందుకు బ్యాంకులు ససేమిరా అంటుండడంతో ఉద్యోగులకు చెల్లించాలని నిర్ణయించింది. ప్రతి ట్రాన్స్ పోర్టు ఉద్యోగికి రూ.15వేలు విలువ చేసే నాణేలు ఇవ్వాలని, మిగతా మొత్తాన్ని చెక్కు రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఉద్యోగులు వేతనాల కోసం ప్రతి నెలా 1వ తేదీన గన్నీ సంచులు తీసుకు రావాల్సిన అగత్యం ఏర్పడింది.

పోటీని తట్టుకునేందుకు బెస్ట్ కొద్ది రోజుల క్రితం బస్సు ఛార్జీలను తగ్గించింది. ఫలితంగా బెస్ట్ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదాయంతో పాటు చిల్లర నాణేలు పోగవుతున్నాయి. వీటిని వదిలించుకునేందుకు ఉద్యోగులకు జీతాల రూపంలో చెల్లించక తప్పడం లేదని యాజమాన్యం అంటుండగా, ఇంత పెద్ద మొత్తంలో ఉన్న చిల్లరు ఇంటికి ఎలా తీసుకువెళ్లాలని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కోసం ఇంత మొత్తంలో చిల్లర ఇస్తే వ్యాపారులు కూడా నిరాకరిస్తున్నారని ఉద్యోగులు లబోదిబొమంటున్నారు.

latest telugu newsOwns Brihanmumbai Electric Supply and TransportTelugu breaking newstelugu news