తప్పించుకుని పరుగులు పెట్టిన ఆస్ట్రిచ్

కరాచీ: పాకిస్థాన్ లోని కరాచీ రోడ్లపై ఆస్ట్రిచ్ పక్షి వాహనదారులను కనువిందు చేసింది. వాహనదారులతో పాటు తాను పరుగులు పెట్టి పలువురిని ఆనందింప చేసింది.

జూ లో సిబ్బంది కళ్లుగప్పిన ఆస్ట్రిచ్ పక్షి తప్పించుకుని రోడ్డు మీదికి వచ్చింది. ఎలాంటి బ్యారికేడ్లు లేకపోవడం, స్వేచ్ఛ లభించడంతో ఇంకేముందు వాహనదారులతో పాటు తాను పరుగులు తీసింది. అమాయక పక్షి తాను ఏం చేస్తుందో తనకే ఒక ఆలోచన లేకుండా రోడ్డుపై పరుగులు తీస్తున్నదంటూ ఒక ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోను ట్వీట్ చేస్తూ సందేశమిచ్చారు.
ఈ విషయం జూ సిబ్బందికి తెలియడం తో వెంటనే ఆస్ట్రిచ్ ను పట్టుకున్నారు. ప్రత్యేక వాహనంలో దాన్ని తిరిగి జూ కు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

latest telugu newsostrich birdTelugu breaking newstelugu news