వంద శాతం ప్రేక్షకుల అనుమతికి హైకోర్టు బ్రేక్

చెన్నై: సినిమా థియేటర్లలో 50 శాతానికి మించకుండా ప్రేక్షకులను అనుమతించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై జనవరి 11లోపు స్పందించాలని, లేనిచో తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించింది.

తమిళనాడులో సినిమా థియేటర్లలో వంద శాతం సీట్లలో ప్రేక్షకులను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై స్టే విధించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ నెల 4వ తేదీన వంద శాతం ప్రేక్షకులను అనుమతిస్తూ తమిళనాడు ప్రధాన కార్యదర్శి షణ్ముగం ఆదేశాలు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ గోపాలపురం కు చెందిన బాబు మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేవారు. పర్యాటక కేంద్రాలు, మెరీనా బీచ్ లో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధించిన ప్రభుత్వం సినిమా థియేటర్లలో మాత్రం పూర్తిగా ప్రేక్షకులను అనుమతించడం ఎంత వరకు సమంజసమని పిటీషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీని వల్ల కరోనా వైరస్ విజృంభించే అవకాశముందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

latest telugu newsMadras High courtTelugu breaking newstelugu news