జగన్ ని వదిలే ప్రసక్తి లేదు: వైసిపి ఎంపి రాజు

న్యూఢిల్లీ: వైసిపి రెబల్ ఎంపి కె.రఘురామకృష్ణ రాజు తన పార్టీ అధినేత, సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కొన్ని నెలలుగా విమర్శల దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగ మరో అడగు ముందుకు వేసి ఆయన బెయిల్ పై ఎక్కుపెట్టారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణ రాజు హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నాట్లు ప్రకటించారు. సిబిఐ కోర్టుకు సోమవారం సెలవు లేదని, ఈసారి తప్పనిసరిగా తన పిటిషన్ న్యాయస్థానం స్వీకరిస్తుందన్న ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ తన పిటిషన్ విచారణకు రాకపోతే.. హైకోర్టును ఆశ్రయిస్తాననన్నారు. తన పిటీషన్ పై సిబిఐ కోర్టుకు శనివారం ఓ లేఖ రాసినట్టు రామకృష్ణరాజు తెలిపారు.
సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిందితుడి తరఫున పని చేస్తున్నారా లేక సిబిఐ తరఫున పని చేస్తున్నారా అన్నది సోమవారం వెల్లడవుతుందన్నారు.

‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అని పాడుకుంటారో.. ‘‘నీ పాపం పండెను నేడు… నీ భరతం పడతా చూడు’’ అని అంటారో సోమవారం నాటికి తేలిపోతుందని ఆయన అన్నారు. సిబిఐ కోర్టులో రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌‌ సాంకేతిక కారణాలతో విచారణకు రాలేదు. పిటిషన్‌లో జగన్‌ బెయిల్‌ రద్దుకు సంబంధించి తాను సమర్పించిన ఆధారాలపై సిబిఐ కోర్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ఆయన వివరించారు. పిటిషన్ తిరస్కరణకు గురైందన్న వార్తలు చక్కర్లు కొట్టడంతో ఆయనే స్వయంగా దీనిపై వివరణ ఇచ్చారు.

latest telugu newsTelugu breaking newstelugu news