వ్యాక్సిన్ వేసుకున్న సినీజంట

చెన్నై: ప్రేమ పక్షులు నయనతార, విఘ్నేష్ శివన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇద్దరు కలిసి ఒకేసారి వేయించుకున్న వ్యాక్సిన్ ఫొటోలను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సౌత్ ఇండియా బ్యూటీగా పేరు సంపాదించుకున్న నయనతార, యువ దర్శకుడు విఘ్నేష్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తరచూ ఇద్దరు కలిసి విహారానికి, పర్యటనకు వెళ్తూ ఫొటోలకు పోజులిస్తున్నారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనప్పటికీ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో వాయిదా పడిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం సమంత అక్కినేనితో కలిసి నయనతార, ప్రేమికుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నది. కాతు వాకుల రెండు కాదల్ చిత్రం సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడగా, ఇందులో హీరోగా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇద్దరు వ్యాక్సిన్ వేసుకున్న ఫొటోలను చూసిన నెటిజన్లు, ఇద్దరికీ 45 ఏళ్లు నిండయా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

latest telugu newsNayantaraNayantara Vignesh Sivan was vaccinatedTelugu breaking newstelugu newsVignesh Sivan