బట్టలిప్పాడు… బజారునపడ్డాడు!

బెంగళూరు: పెళ్లి చేసుకునేందుకు ఒక యువకుడు ఆన్ లైన్ ఫోర్టల్ లో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. ఇదే సైట్ ద్వారా పరిచయం అయిన ఒక యువతిని నమ్మి నిండా మోసపోయాడు. డబ్బులతో పాటు పరువు కోల్పోయాడు.

బెంగళూరు హులిమావు వాసి అంబిత్ కుమార్ మిశ్రా (33) కొద్ది రోజుల క్రితం శ్రేయ అనే యువతి ఫోన్ చేసింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఎలక్ట్రానిక్ సిటీలో పనిచేస్తున్నానని తెలిపింది. మీ బయోడెటా చూసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. మాటామాటా కలవడంతో ఇద్దరూ తరచూ మొబైల్ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన వాట్సప్ వీడియో కాల్ చేయాల్సిందిగా ఆమె అంబిత్ ను కోరింది. పరిచయం అయింది కదా అని వీడియో కాల్ చేశారు. కొద్ది సేపు మాట్లాడుకున్న తరువాత ఆమె తన దుస్తులను విప్పేసింది. నగ్నంగా నిలబడడతో అంబిత్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నేను విప్పాను మీరు కూడా విప్పరా అంటూ అడగడంతో ఇంకేముంది విప్పేశాడు. అతని దస్తులు విప్పినప్పుడు ఆమె మొత్తం వీడియోను రికార్డు చేసింది.

డబ్బులు ఇస్తావా నీ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయాలా అని బెదిరింపులకు దిగింది. రూ.1 లక్ష ఇస్తే తప్ప వదిలేది లేదని హెచ్చరించడంతో రూ.20వేలు సమర్పించుకున్నాడు. మిగతా డబ్బుల కోసం ఫోన్ చేయడంతో అంబిత్ కుమార్ మిశ్రా పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. తనకు జరిగిన మోసాన్ని వివరించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించారు. నిందితురాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరా నుంచి ఫోన్ చేసినట్లు తేలింది.

bengal howrahelectronic cityman bared himselfmatrimonial sitenaked mansoftware engineerwhatsapp video call