బెంగాల్ లో హత్యలు, అత్యాచారాలు: గవర్నర్

కొలకతా: అసెంబ్లీ ఎన్నికల తరువాత పశ్చిమ బెంగాల్ హత్యలు, అత్యారాలు, లూటీలతో అట్టుడికి పోతున్నదని రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రతీకార దాడులపై ప్రభుత్వ చర్యలపై వివరించేందుకు సోమవారం నాడు రాజ్ భవన్ కు రావాల్సిందిగా ప్రధాన కార్యదర్శి హెచ్.కె.ద్వివేదిని సూచించినట్లు గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో హింసాత్మక వాతావరణంపై గవర్నర్ ఇవాళ వరుస ట్వీట్లు చేశారు. బిజెపీ పై దాడుల్లో అధికార పక్షంతో రాష్ట్ర పోలీసులు రాజీపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయి. ఇంటెలిజెన్స్, పోలీసులు పూర్తిగా రాజీ వైఖరి అవలంభిస్తున్నారు. టిఎంసి పార్టీకి వ్యతిరేకంగా, బిజెపికి అనుకూలంగా ఓటేసిన వారిపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. టిఎంసి ప్రతీకార దాడులతో లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ధ్వంసమయ్యాయి. వ్యాపారం నిర్వహించేందుకు కూడా దోపిడి రుసుం చెల్లించాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరం. అధికార పార్టీ చేతిలో ప్రజస్వామ్యం ఖూనీ అవుతోందని గవర్నర్ ధన్కర్ ట్వీట్ చేశారు.

 

 

bengal policeGovernor Jagdeep Dhankarmamata benerjeetmc party criminalsWest Bengal BJPwest bengal rajbhavanwest bengal state