అడ్వకేట్ దంపతుల హత్య గర్హనీయం: హైకోర్టు

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో న్యాయవాదులైన దంపతుల హత్యపై హైకోర్టు స్పందించింది. ఈ హత్యలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు, నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని, భార్యాభర్తలైన ఇద్దరి హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమగ్రంగా విచారించి ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కోరింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని, న్యాయవాదుల హత్య తీవ్ర గర్హనీయమని హైకోర్టు పేర్కొంది. పెద్దపల్లి జిల్లాలో బుధవారం జరిగిన హత్య అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణ మార్చి 1కి వాయిదా వేసింది.

latest telugu newsmurder of a lawyer coupleTelugu breaking newstelugu news