మైనర్ బాలికను పెళ్లాడిన ఎంపీ

ఇస్లామాబాద్: ఇస్లామిక్ దేశంగా వెలుగొందుతున్న పాకిస్తాన్ లో ఏ హక్కులు ఉండవు. పైకి చెప్పుకోవడానికి మాత్రమే హక్కులు కాని బానిసల్లాగా బతకాల్సిందే. ఒక ఎంపీ మైనర్ కూడా తీరని 14 సంవత్సరాల బాలికను వివాహం చేసుకుని వార్తల్లోకి ఎక్కాడు.
జమియల్ ఉలేమా ఏ ఇస్లాం నేత, పాకిస్తాన్ ఎంపీ మౌలానా సలావుద్దీన్ ఆయూబీ (50) వైభవంగా 14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత అందరికీ విందు కూడా ఇచ్చాడు. స్థానికంగా ఉండే జుగూరు ప్రభుత్వ పాఠశాలలో చదవుతున్న ఈ బాలిక 2006లో జన్మించినట్లు రికార్డుల్లో ఉంది. ఈ రికార్డుల ఆధారంగా మహిళా సంక్షేమ సంస్థ ఒకటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహిళా సంక్షేమ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాలికకు తాము పెళ్లి చేయలేదని, ఈ పెళ్లి తంతుతో తమకెలాంటి సంబంధం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు అఫిడవిట్ సమర్పించారు. అఫిడవిట్ ను చూసిన పోలీసులు కంగుతిన్నారు. పాకిస్థాన్ చట్టాల ప్రకారం 16 సంవత్సరాలు నిండిన బాలికను మాత్రం వివాహం చేసుకోవాలి. మైనర్ బాలికలను చేసుకుంటే అది చెల్లుబాటు కాకపోగా చేసుకున్నవారిని కఠినంగా శిక్షిస్తారు.

latest telugu newsMP married a minor girlTelugu breaking newstelugu news