హీరో గ్లామర్ కు మరిన్ని ఫీచర్లు

న్యూఢిల్లీ: దేశీయ టూ వీలర్ హీరో తన గ్లామర్ బైక్ కు మరిన్ని అదనపు ఫీచర్లను కల్పించి కొత్తగా విడుదల చేసింది. బ్లూ టూత్ కనెక్టివిటీ, నావిగేషన్, యు.ఎస్.బి ఛార్జర్ సౌకర్యం కల్పించారు.
ఢిల్లీ షోరూమ్ లో డ్రమ్ బ్రేక్ కలిగిన బైక్ ధర రూ.78,900 కాగా డిస్క్ బ్రేక్ బైక్ ధర రూ.83,500 గా ఖరారు చేశారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, సాంకేతికతకు అనుగుణంగా ప్రస్తుత మోడళ్లలో మార్పులు తెస్తున్నట్లు హీరో కంపెనీ ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో అమ్మకాలు సాధించలేకపోయామన్నారు. అయినా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మోడళ్లను ఆధునీకరిస్తున్నామన్నారు.

Telugu breaking newsTelugu latest newstelugu news