నూతన పార్లమెంటుకు ముహూర్తం ఖరారు

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవన నిర్మాణ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. రూ. 861.9 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పార్లమెంటు నిర్మాణానికి డిసెంబర్ 10న ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారు.

64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల భారీ రాజసౌధం నిర్మించనున్నారు. నిర్మాణ బాధ్యతలు టాటా సంస్థ తీసుకుంది. 21 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా కష్ట కాలంలో భారీ నిధులు వెచ్చించి భవనం నిర్మిస్తుండటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

latest telugu newsTelugu breaking newstelugu news