2 గజాల దూరం పాటించాలి: మోదీ

ఢిల్లీ: కరోనా వైరస్ నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదు, వాక్సిన్ వచ్చేంత వారకు ప్రతి ఒక్కరు రెండు గజాల దూరం పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు.

మాస్కులు కచ్చితంగా ధరించాలని, కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. వలస కూలీల కోసం రూపొందించన ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్ గార్ అభియాన్ పథకాన్ని మోదీ ఇవాళ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి రోజ్ గార్ అభియాన్ యోజన పనిశక్తిపైనే ఆధారపడి ఉందని, ఈ పథకానికి అదే ప్రేరన అని ఆయన అన్నారు. ఉత్తర ప్రదేశ్ లాగా ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి పథకాలను తెస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో యూపీ ప్రభుత్వం పోరాడుతుందని కితాబునిచ్చారు.

latest telugu newsmodi suggested on corona Precautionsnarendra modiTelugu breaking newstelugu news