నష్టాల కంపెనీలను ప్రైవేటీకరిస్తాం: మోదీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: నష్టాలతో నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ కంపెనీలను నడపలేమని, వాటి పరిపుష్టికి నిధులు సమకూర్చడం కూడా సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టి చెప్పారు.

దేశంలో నష్టాల్లో ఉన్న అనేక పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ప్రజల సొమ్ముతో నడుస్తున్నాయని, నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాలను ప్రభుత్వం ప్రైవేటీకరించే అంశంలో కట్టుబడి ఉందని మరోసారి ప్రధాని స్పష్టం చేశారు. ఇవాళ డిపార్ట్ మెంట్ ఆప్ ఇన్వెస్టిమెంట్ అండ్ పబ్లిక్ అస్సె మేనేజిమెంట్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై వెబినార్ జరిగింది. ఈ వెబినార్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లడుతూ, ప్రభుత్వం వైదొలుగుతున్న రంగాలను ప్రైవేటు కంపెనీలు భర్తీ చేస్తాయని, ప్రైవేటు రంగం అత్యత్తమ విధానాలను తెస్తుందని వివరించారు. వారసత్వంగా వస్తున్నాయన్న కారణంతో పబ్లిక్ సెక్టార్ కంపెనీలను ఇక నడపలేమని ఆయన అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో పబ్లిక్ సెక్టార్ కంపెనీలను స్థాపించిన పరిస్థితులు వేరని, ఇప్పటి పరిస్థితులు వేరని ఆయన తెలిపారు. పాత విధానాల్లో సంస్కరణలు అవసరమని, ప్రజా ధనం సద్వినియోగం చేసేందుకేనని మోదీ పునరుద్ఘాటించారు.

latest telugu newsPrime Minister Narendra ModiTelugu breaking newstelugu news