వైసీపీ ఎంపీని అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు

గుంటూరు: జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధులు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనే అనే రీతిలో బహిరంగంగా పోరుకు దిగుతున్నారు.

ఇవాళ చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను ఎమ్మెల్యే రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. వైసీపీ కార్యకర్త గంటా హరికృష్ణ కుటుంభాన్ని పరామర్శించేందుకు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వచ్చారు.తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని స్థానిక వైసీపీ నేత కోటిరెడ్డి ప్రశ్నించారు.
పరామర్శ కోసం మాత్రమే వచ్చానని చెప్పినా కోటిరెడ్డి పట్టించుకోలేదు. ఎంపీ వాహనానికి అడ్డుపడి ఎంపీతో వాగ్వాదం. పోలీసులు సాయంతో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అక్కడి నుంచి బయటపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనధికార కార్యక్రమాలకు సైతం ఇబ్బందులు కలిగించటం సరికాదన్నారు.

latest telugu newsTelugu breaking newstelugu news