ఆనందయ్య మందుపై ఆరోపణలు వద్దు: ఎమ్మల్యే కాకాణి

నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై అనవసరంగా ఆరోపణలు చేయవద్దని, ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేపవద్దని వైసిపి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి మీడియా సంస్థలకు చురకలు అంటించారు.

ఆదివారం నాడు కాకాణి గోవర్థన్ రెడ్డి, ఆనందయ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ కు ఆనందయ్య ఇస్తున్న మందుపై కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఇది ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. త్వరలోనే అనుమానాలు నివృత్తి అవుతాయని, ప్రభుత్వం నిర్ణయం తీసుకునేవారు రాద్ధాంతం చేయవద్దని హితవు పలికారు. తను తయారు చేసిన పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందుపై ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తానని బొనిగె అనందయ్య స్పష్టం చేశారు. తమ మందు నాణ్యతపై పరిశీలించేందుకు న్యూఢిల్లీ నుంచి ఐసిఎంఆర్ బృందం వచ్చిందని, అధ్యయనం చేస్తున్నదని తెలిపారు. ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారు చేశానని, వైద్యాన్ని అమ్ముకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

Anandayya Ayurvedic medicineKrishnapatnam Anandayya Ayurvedic medicineYCP MLA Kakani Govarthan Reddy