హిందూస్థాన్ పేరు మార్చాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే వివాదం!

పాట్నా: బీహార్ అసెంబ్లీలో జరిగిన ప్రమాణ స్వీకారాల్లో వివాదం నెలకొంది. ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన అఖ్బరుల్ ఇమాన్ ప్రమాణ స్వీకారం చేస్తూ.. డ్రాఫ్ట్ లో ఉన్న హిందూస్థాన్ స్థానంలో భారత్ అని చేర్చాలని తీవ్రంగా పట్టుబట్టాడు.

దీనిపై స్పందించిన ప్రొటెం స్పీకర్ జితన్‌రామ్ మాంఝీ కాసేపు వారించి అనంతరం భారత్ అని పలికేందుకు అనుమతించారు. అయితే తాను వివాదం చేయాలని అలా ప్రవర్తించలేదని.. రాజ్యాంగం ఏ భాషలోనైనా ‘భారత్’  అని పలకవచ్చని సూచించిన ప్రకారమే తాను ప్రశ్నించినట్టు ఇమాన్ తెలిపారు.

latest telugu newsTelugu breaking newstelugu news