మొరాయించిన సోషల్ మీడియా సేవలు

వాషింగ్టన్: ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీసు వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ సేవలు శుక్రవారం రాత్రి మొరాయించాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. రకరకాల సమస్యల కారణంగా తమ మెసేజీలను పంపించలేకపోయారు.

మెసేజీ పంపించిన ప్రతిసారి ఎర్రర్ అంటూ కన్పించడంతో చికాకు పడ్డారు. తమకే జరుగుతుందా ఇంకా ఎవరైనా ఇబ్బందిపడుతున్నారా అంటూ ఫ్రెండ్స్ ను ఆరా తీశారు. కొందరైతే అత్వసర మెసేజీ పంపించలేకపోయారు. ఏం జరుగుతుందంటూ గూగుల్ లో వెదికినప్పటికీ సమాచారం లభించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. సర్వర్లు డౌన్ కావడం మూలంగానే వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ సేవలు అర్థాంతరంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ లెక్కల ప్రకారం ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులు 12 లక్షలు, వాట్సప్ 38వేల మంది, ఫేస్ బుక్ వినియోగదారులు 1600 మంది ఆన్ లైన్ లో ఫిర్యాదులు పంపించారు.

latest telugu newssocial media servicesTelugu breaking newstelugu news