మూడోసారి సిఎంగా మమతా బెనర్జీ ప్రమాణం

కొలకతా: మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో మూడోసారి ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్, మమతతో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, టిఎంసి ముఖ్య నాయకులు మాత్రమే పాల్గొన్నారు. రేపు (గురువారం) నాడు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. రాష్ట్ర శాసన సభలో 292 స్థానాలకు గాను 213 స్థానాల్లో టిఎంసి అభ్యర్థులు విజయం సాధించారు. నందిగ్రామ్ నుంచి మమత ఓటమి పాలు కావడంతో ఆరు నెలల్లో ఆమె శాసన సభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఇంకా వెల్లడించలేదు. గతంలో నిల్చున్న భవానీపుర నుంచి మళ్లీ పోటీ చేస్తారా వేరే నియోజకవర్గమా అనేది తెలియాల్సి ఉంది.

latest telugu newsMamata BanerjeeTelugu breaking newstelugu news