బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షసూచన

చెన్నై: గత వారం రోజులగా నివర్ తుఫాను కారణంగా తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండగా.. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి కొన్ని గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని తెలిపింది.

వీటి ప్రభావంతో మరో రెండ్రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రేపు ఇది ‘బురేవి’ తుపానుగా మారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

breaking news in teluguchennilatest news in telugustormTelugu breaking newsTelugu latest newstoday latest newstoday news in teluguweather information