కర్ణాటకలో లాక్ డౌన్ మరోసారి పొడిగింపు

బెంగళూరు: సెకండ్ వేవ్ ఉధృతి తగ్గేలా లేకపోవడం, కేసుల సంఖ్య నిలకడగా ఉండడంతో కర్ణాటక ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించింది. జూన్ 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి బిఎస్.యడ్యూరప్ప తెలిపారు.

లాక్ డౌన్ అమలు, కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పై శుక్రవారం నాడు యడ్యూరప్ప అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం అయ్యింది. సుధీర్ఘంగా చర్చించిన మంత్రి మండలి ప్రజా ప్రయోజనం దృష్ట్యా లాక్ డౌన్ పొడిగింపు మరో మార్గం లేదని నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సిన్ ఇచ్చేందుకు అందుబాటులో డోసులు లేకపోవడం, వైరస్ వేగంగా వ్యాప్తిచెందడంతో లాక్ డౌన్ ను మరికొన్న రోజులు పొడిగించక తప్పడం లేదని సిఎం తెలిపారు. మే 24 వరకు గడువు ఉండగా దాన్ని జూన్ 7 వరకు పొడిగించామని అన్నారు. ఉదయం 10 గంటల తరువాత కొందరు పని లేకున్నా రోడ్లపై తిరుగుతున్నారని, వారి మూలంగా పని ఉండి బయటకు వచ్చేవారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మంత్రి మండలి అభిప్రాయపడింది. ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా ఉండాలని, జులాయిగా తిరుగుతున్న వారి వాహనాలు జప్తు చేయాలని సిఎం యడ్యూరప్ప పోలీసులను ఆదేశించారు.

బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి ప్రభుత్వమే చికిత్స చేయిస్తుందని ఆయన తెలిపారు. సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా మే 10 నుంచి రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు మినహాయింపునిచ్చారు.

Chief Minister BS YeddyurappaKarnataka Lockdown extendedlatest telugu newsLockdown in KarnatakaTelugu breaking newstelugu news